పూరీ రథయాత్రకు.. ఎయిర్‌‌‌‌టెల్ 5జీ నెట్ వర్క్

పూరీ రథయాత్రకు.. ఎయిర్‌‌‌‌టెల్ 5జీ నెట్ వర్క్

హైదరాబాద్​, వెలుగు: ఒడిశా నగరం పూరీలో రథయాత్రకు వచ్చే వారికోసం  ఎయిర్‌‌‌‌టెల్ తన నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను బలోపేతం చేసింది. పండుగ సమయంలో పెరిగే వాయిస్, డేటా ట్రాఫిక్‌‌‌‌ను తట్టుకోవడానికి పూరీ వైపు వెళ్లే రహదారులు, రైల్వే మార్గాల్లో 5జీ కనెక్టివిటీని పెంచింది. ఎయిర్‌‌‌‌టెల్ గత 12 నెలల్లో ఒడిశా వ్యాప్తంగా 1,500 కొత్త 5జీ సైట్లను ఏర్పాటు చేసింది. దీనివల్ల 30 జిల్లాల్లోని 1.1 కోట్ల మందికి హైస్పీడ్ నెట్​ అందుబాటులోకి వచ్చింది. 

అన్ని ప్రాంతాల్లో సేవల నాణ్యత పెరిగిందని ఎయిర్‌‌‌‌టెల్ ఒడిశా ప్రతినిధి తెలిపారు. పూరీ రథయాత్రకు వచ్చే లక్షలాది మంది భక్తులకు అంతరాయం లేని సేవలు అందించడమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. కస్టమర్ల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి ఎయిర్‌‌‌‌టెల్ సరికొత్త అన్‌‌‌‌లిమిటెడ్ ప్యాక్‌‌‌‌లను కూడా ప్రవేశపెట్టింది.  ప్లాన్ల ధరలు రూ.400 నుంచి మొదలవుతాయి.