కాళేశ్వరం బ్యారేజీల్లో నీళ్లు నింపొద్దు..ఎన్డీఎస్ఏ చెప్పినట్టు గేట్లు తెరిచే ఉంచాలి: రిటైర్డ్ హైదరాబాద్ఇంజనీర్ల సంఘం

కాళేశ్వరం బ్యారేజీల్లో నీళ్లు నింపొద్దు..ఎన్డీఎస్ఏ చెప్పినట్టు గేట్లు తెరిచే ఉంచాలి: రిటైర్డ్ హైదరాబాద్ఇంజనీర్ల సంఘం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో ని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తీవ్ర నిర్మాణపరమైన లోపాలు బయటప డ్డాయని రిటైర్డ్ హైదరాబాద్ ఇంజినీర్ల సం ఘం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటిని ఎత్తిపోసే పరిస్థితి అస్సలు లేదని స్పష్టం చేసింది.

ఈ మేరకు మంగళవారం సంఘం అధ్యక్షుడు జంబుల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రఘుమా రెడ్డి నేతృత్వంలో సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మేడిగడ్డ బ్యారేజీలో ప్రస్తుతం తీవ్రమైన సాంకేతిక సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. మరమ్మతులు పూర్తయ్యే వర కు బ్యారేజీలలో ఎలాంటి నీటిని నిల్వ చేయరా దని రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.