డీఎస్సీ-2003 టీచర్లకు పాత పెన్షన్ ఇవ్వాలి..సీఎస్‌‌‌‌ సంజయ్ జాజుకు టీపీటీఎఫ్ వినతి

డీఎస్సీ-2003 టీచర్లకు పాత పెన్షన్ ఇవ్వాలి..సీఎస్‌‌‌‌ సంజయ్ జాజుకు టీపీటీఎఫ్ వినతి

హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ 2003 ద్వారా నియామకమైన టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) కోరింది. మంగళవారం సెక్రటేరియెట్‌‌‌‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చకినాల అనిల్ కుమార్, నన్నెబోయిన తిరుపతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా విద్యారంగ సమస్యలపై వినతిపత్రం అందించి వారు మాట్లాడారు.

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, కొత్త పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌‌‌‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. టీచర్లకు ఏకీకృత సర్వీస్ రూల్స్ తేవాలని, మోడల్ స్కూల్స్, గురుకులాలు, కేజీబీవీలను విద్యాశాఖలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్‌‌‌‌ను కలిసిన వారిలో టీపీటీఎఫ్ రాష్ట్ర  నాయకులు ముత్యాల రవీందర్, ఎం. లక్ష్మయ్య యాదవ్, వేల్పుల బాలయ్య ఉన్నారు.