మళ్లీ రిపీట్ కాబోతున్న నేషనల్ అవార్డ్ కాంబో! బాలయ్య-అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీపై క్రేజీ అప్‌డేట్!

మళ్లీ రిపీట్ కాబోతున్న నేషనల్ అవార్డ్ కాంబో! బాలయ్య-అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీపై క్రేజీ అప్‌డేట్!

నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌‌‌‌లో మరో సినిమా తెరకెక్కబోతోందన్న వార్త  ప్రస్తుతం టాలీవుడ్‌‌‌‌లో హాట్ టాపిక్‌‌‌‌గా మారింది. మూడు సంవత్సరాల క్రితం విడుదలైన  ‘భగవంత్ కేసరి’  బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతోపాటు 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా  నేషనల్ అవార్డును  కూడా సొంతం  చేసుకుంది. దీంతో  ఈ కాంబినేషన్‌‌‌‌కు మరింత క్రేజ్ పెరగగా, ఇప్పుడు మరోసారి వీరిద్దరూ చేతులు కలపనున్నారనే  ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.

ఇప్పటికే బాలకృష్ణ కోసం అనిల్ రావిపూడి మరో  పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.  త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌‌‌‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం, కొరటాల శివ డైరెక్షన్‌‌‌‌లో ఓ మూవీ చేస్తున్నారు. ఈ రెండు పూర్తవగానే అనిల్‌‌‌‌తో సినిమా స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి కూడా ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ క్రేజీ కాంబో సెట్స్‌‌‌‌కు వెళ్లే చాన్స్ ఉందని తెలుస్తోంది.