దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించిన చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. జులై 17న సినిమా విడుదల కానుంది.
తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ‘ఫోక్ సింగర్ కోమలి ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ఘనవిజయం సాధించాలని కోరుతున్నా. చిన్న సినిమాలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించాలి. తెలంగాణలో చిన్న సినిమాల అభివృద్ధికి తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది’ అని అన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి ఆదరణ దక్కిందని, మానవ సంబంధాలు, తల్లిదండ్రుల విలువ, కుటుంబ బంధాల గొప్పదనం చెప్పేలా ఈ చిత్రం ఉంటుందని టీమ్ చెప్పింది.
