తుంబాడ్ 2' లోకి అలియా భట్..

తుంబాడ్ 2' లోకి అలియా భట్..

ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన హిందీ చిత్రం ‘తుంబాడ్‌‌‌‌’.. ఇండియన్‌‌‌‌ హారర్ థ్రిల్లర్స్‌‌‌‌లో కల్ట్‌‌‌‌ క్లాసిక్‌‌‌‌గా నిలిచింది. ఓటీటీలోకి వచ్చాక ఈ మూవీకి  ఫ్యాన్‌‌‌‌ ఫాలోయింగ్‌‌‌‌ మరింత పెరిగింది. రెండేళ్ల క్రితం రీ రిలీజ్‌‌‌‌ చేయగా నలభై కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్‌‌‌‌ తెరకెక్కిస్తున్నారు.   ‘తుంబాడ్‌‌‌‌ 2’ పేరుతో ఆదేశ్ ప్రసాద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సోహమ్ షా లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తుండగా, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో అలియాభట్‌‌‌‌ నటించబోతోందంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది.  

ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ.. అలియా ఇందులో నటించబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.  ‘‘ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది.. ‘తుంబాడ్ 2’లోకి అలియా భట్‌‌‌‌కు స్వాగతం’ అంటూ ఆమెతో కలిసున్న ఫొటోస్‌‌‌‌ను సోహుమ్‌‌‌‌ షా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘తుంబాడ్‌‌‌‌’ లాంటి ప్రత్యేకమైన ప్రపంచంలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందని అలియా చెప్పింది. పెన్‌‌‌‌ స్టూడియోస్‌‌‌‌తో కలిసి సోహమ్ షా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 3న ప్రేక్షకుల ముందుకురానుంది.