SBI లాభం 23 వేల కోట్లు.. గతేడాదితో పోలిస్తే 14 శాతం పెరుగుదల 

SBI లాభం 23 వేల కోట్లు.. గతేడాదితో పోలిస్తే 14 శాతం పెరుగుదల 
  • నికరవడ్డీ ఆదాయం రూ.49 వేల కోట్లు

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ 2027 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో లాభాల పంట పండించింది. బ్యాంకు నికర లాభం వార్షికంగా14.3 శాతం పెరిగి రూ.23,038 కోట్లకు చేరుకుంది. మార్కెట్ నిపుణులు ఈసారి లాభాలు రూ.22,859 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేశారు. అయితే బ్యాంకు అంచనాలను మించి రాణించింది.  ఎన్​ఎస్​ఈ, మ్యూచువల్​ విభాగంలో వాటాలను అమ్మడంతో రూ.7,289 కోట్లు సమకూరడం వల్లే లాభాలు ఈ రికార్డు స్థాయిలో పెరిగాయి.  

బ్యాంకుకు వచ్చిన వడ్డీకి ఖాతాదారులకు చెల్లించిన వడ్డీకి మధ్య ఉండే వ్యత్యాసమైన నికర వడ్డీ ఆదాయం 14.7 శాతం పెరిగి రూ.49,143 కోట్లకు చేరింది. గత సెప్టెంబరు క్వార్టర్లో నికర వడ్డీ ఆదాయం రూ.42,847 కోట్లుగా ఉంది. సీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ టీవీ–18 పోల్ అంచనా వేసిన రూ.47,901 కోట్ల కంటే ఇది ఎక్కువే కావడం విశేషం.  నిర్వహణ లాభం మాత్రం 1.4 శాతం తగ్గి రూ.27,311 కోట్ల నుంచి రూ.26,937 కోట్లకు పరిమితం అయిందని ఎస్​బీఐ తెలిపింది. 

 భారీగా తగ్గిన మొండి బకాయిలు

ఈసారి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. గత జూన్ క్వార్టర్లో 1.47 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిల (జీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏ) నిష్పత్తి 1.39 శాతానికి దిగివచ్చింది. గత రెండు దశాబ్దాల్లో జీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏ నిష్పత్తి ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి.  నికర మొండి బకాయిల (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏ) నిష్పత్తి కూడా 0.38 శాతం నుంచి స్వల్పంగా తగ్గి 0.36 శాతానికి చేరింది. క్వార్టర్లో కొత్తగా ఏర్పడిన మొండి బకాయిలు రూ.5,227 కోట్లు ఉన్నాయి.