మలక్పేట డీమార్ట్లో తనిఖీలు.. బియ్యం కిలో రూ.70 అయితే రూ.84కి అమ్మకం

మలక్పేట డీమార్ట్లో తనిఖీలు.. బియ్యం కిలో రూ.70 అయితే రూ.84కి అమ్మకం
  • షోకాజ్​ నోటీసు జారీ

మలక్ పేట, వెలుగు: సివిల్ ​సప్లయీస్ ​అధికారులు మలక్‌‌‌‌పేట సర్కిల్ పరిధిలోని పలు షాపులతో పాటు డీమార్ట్​స్టోర్​పై మంగళవారం రైడ్స్​ నిర్వహించారు. బియ్యం అమ్మకాలలో అధిక ధరల వసూళ్లు, బ్లాక్ మార్కెటింగ్, తూకాల్లో మోసాలపై తనిఖీలు చేశారు.

మలక్​పేట డీమార్ట్​లో సోనా మసూరి బియ్యం అమ్ముతుండడంతో షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే, మలక్​పేట గంజ్​తో పాటు మరో 36 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.  కొందరు  ట్రేడ్ లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తుండగా, మరికొందరు జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా బిజినెస్​చేస్తున్నారు.

ఇంకొందరు సర్టిఫై చేయని వెయింగ్ ​మెషీన్లు వినియోగిస్తున్నట్లు తెలుసుకున్నారు. కొన్ని చోట్ల నిర్ణీత బరువు కంటే తక్కువ పరిమాణంలో బియ్యం అమ్ముతున్నారని వెల్లడైంది.  ఈ సందర్భంగా నాలుగు బియ్యం డిపోలపై కేసులు నమోదు చేశారు. సివిల్ సప్లయీస్​ఆఫీసర్​ఏఎస్ఓ నర్సింగ్‌‌‌‌ రాజు, ఇన్​స్పెక్టర్లు ప్రదీప్, భరత్, ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్​హరికృష్ణ, మంజుల పాల్గొన్నారు.