నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్య తీసుకోండి..మోదీకి కేతన్‌‌‌‌‌‌‌‌ తల్లి లెటర్

నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్య తీసుకోండి..మోదీకి కేతన్‌‌‌‌‌‌‌‌ తల్లి లెటర్

ముంబై: పుణెలోని లోహగఢ్ కోట వద్ద హత్యకు గురైన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌‌‌‌‌‌‌‌ కేసులో న్యాయం కోరుతూ అతని తల్లి రాఖీ అగర్వాల్ ప్రధాని నరేంద్ర మోదీకి భావోద్వేగ లేఖ రాశారు. తన కొడుకు హత్య కేసు.. సాధారణ కేసు ఫైల్‌‌‌‌‌‌‌‌గా మిగిలిపోకుండా చూడాలని కోరారు. జాప్యం జరగకుండా నిందితులకు కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘నా కొడుకు పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించడం చూడాలని కలలు కన్నాను.. కానీ, అతడి అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. ఒక తల్లికి ఇంతకంటే పెద్ద బాధ ఉండదు’ అని రాఖీ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. 

కేతన్ హత్యతో తమ ప్రపంచం చీకటైపోయిందని పేర్కొన్నారు. కేతన్ మరణాన్ని తట్టుకోలేక అతడి తాత దేవీచంద్ అగర్వాల్ గుండెపోటుతో మరణించారని చెప్పారు. కొద్ది రోజుల్లోనే తమ కుటుంబం రెండు తరాలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సాయం, సానుభూతి కోరట్లేదని, ఒక తల్లిగా తన కొడుక్కి వెంటనే న్యాయం జరగాలని కోరుకుంటున్నానని రాఖీ అగర్వాల్ లేఖలో పేర్కొన్నారు.