నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లాల్ చంద్ మా జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. మంగళవారం కేంద్ర బృంద సభ్యులు రాజీవ్ రాణా, నీతూలతో కలిసి పథకం అమలులోని సాంకేతిక అంశాలను అధ్యయనం చేయడానికి వచ్చిన ఆయన కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు.
నల్గొండలో పథకం నిర్వహణ బాగుందని, ఈ పథకంలో పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచామని తెలిపారు. కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో పనులు లేక ఇబ్బంది పడుతున్న కూలీలకు, తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో ఈ పథకం ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. అనంతరం పథకంపై రూపొందించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.
