సూర్యాపేట, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. పాఠశాలల ఆధునికీకరణ, వసతుల కల్పనపై ఆయన ఉన్నతాధికారులతో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి క్లాస్ రూమ్‌లోనూ సరిపడా గాలి, వెలుతురు ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులు కూర్చునే బెంచీలు సౌకర్యవంతంగా ఉండాలన్నారు. ప్రతి స్కూల్‌లో పీడీ లేదా పీఈటీలు ఉండేలా చూడాలని, అవసరమైతే డెప్యుటేషన్ ఆర్డర్లు ఇస్తామని చెప్పారు.
