హుస్నాబాద్: మున్సిపల్ కార్మికులకు ‘నమస్తే’ రక్షణ

హుస్నాబాద్: మున్సిపల్ కార్మికులకు ‘నమస్తే’ రక్షణ

హుస్నాబాద్, వెలుగు : పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య, వ్యర్థాల సేకరణ కార్మికుల సేవలు అమూల్యమని హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ దండి లక్ష్మి, కమిషనర్ మల్లికార్జున్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వ ‘నమస్తే’ పథకం కింద కార్మికులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు, పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్యం, సామాజిక భద్రతే లక్ష్యంగా ఈ కార్డుల ద్వారా ఉచితంగా మెరుగైన వైద్యం అందుతుందని, చెత్త సేకరణ సమయంలో అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు పీపీఈ కిట్లు  ఉపయోగపడతాయన్నారు.