ఆపిల్, ఓపెన్ ఏఐ మధ్య లడాయి..డేటా దొంగిలించారంటూ ఓపెన్ఏఐపై ఆపిల్కేసు

ఆపిల్, ఓపెన్ ఏఐ మధ్య లడాయి..డేటా దొంగిలించారంటూ ఓపెన్ఏఐపై ఆపిల్కేసు

న్యూయార్క్​: తమ మాజీ ఉద్యోగులను చేర్చుకుని రహస్య సమాచారాన్ని దొంగిలించిందని ఆరోపిస్తూ యూఎస్​టెక్​కంపెనీ ఆపిల్.. ఓపెన్​ఏఐపై కోర్టులో కేసు వేసింది. మార్కెట్లోకి రాని కొత్త ప్రొడక్టులు, హార్డ్‌‌‌‌వేర్ ప్రాజెక్టుల వివరాలను అక్రమంగా వాడుకుందని ఆరోపించింది.  ఆపిల్ సీనియర్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌‌‌‌లను ఓపెన్ ఏఐ ఆకర్షించిందని పిటిషన్‌‌‌‌లో తెలిపింది. సప్లయర్ వివరాలు, అంతర్గత ఇంజనీరింగ్ విధానాలను మాజీ ఉద్యోగులు ఓపెన్ ఏఐ కి చేరవేశారని ఆపిల్ ఆరోపించింది. ఓపెన్ ఏఐ ఈ ఆరోపణలను తిరస్కరించింది. తాము ఇతర కంపెనీల రహస్యాలపై ఆధారపడటం లేదని స్పష్టం చేసింది. గతంలో ఈ రెండు సంస్థల మధ్య వాణిజ్య ఒప్పందాలు ఉండేవి.