హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ మెజాన్ ఇండియా మెగా ఫుట్‌బాల్ ఫెస్ట్ స్టోర్‌ను ప్రారంభించింది. ఫుట్‌బాల్ అభిమానుల కోసం ప్రత్యేక సేల్ ఈనెల 19 వరకు ఉంటుంది. నైక్, అడిడాస్, ప్యూమా, శామ్సంగ్, బోట్, నివియా, నింజా, హూప్ వంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ఆఫర్లు ఉన్నాయి. ఫుట్‌బాల్ గేర్స్, జెర్సీలు, ట్రైనింగ్ ఎక్విప్‌మెంట్, స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు లభిస్తాయి. అమెజాన్ పే యూపీఐ ద్వారా కనీసం రూ.199 కొనుగోలు చేస్తే 12 శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది. నివియా స్టార్మ్ మోల్డెడ్ ఫుట్‌బాల్ రూ.339 కి, మెర్క్యురీ ఫుట్‌బాల్ రూ.789 కి అందుబాటులో ఉన్నాయి. అడిడాస్ ఫిఫా వరల్డ్ కప్ 26 ట్రైనింగ్ బాల్ రూ.2,239, ప్యూమా ఆర్బిటా ప్లే బాల్ రూ.1,399 కి లభిస్తాయి. హూప్ 5.0 ఫిట్‌నెస్ ట్రాకర్ ధర రూ.28990 గా ఉంది. నైక్ నెదర్లాండ్స్ జెర్సీని రూ.4,330 కి పొందవచ్చు.
