కొడిమ్యాల, వెలుగు : భూ వివాదం కారణంగా ఓ వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో మంగళవారం జరిగింది. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన హన్మంతు (68)కు అదే గ్రామానికి చెందిన రాజనర్సుతో భూమి హద్దుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హన్మంతు మంగళవారం ఎక్స్ ఎల్ బండిపై వెళ్తుండగా... రాజనర్సు కర్రతో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ హన్మంతు అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
