సుల్తానాబాద్: గోదాములను ఇతర జిల్లాలకు కేటాయించవద్దు..మిల్లర్ల ధర్నా.. బియ్యం లారీల అడ్డగింత

సుల్తానాబాద్: గోదాములను ఇతర జిల్లాలకు కేటాయించవద్దు..మిల్లర్ల ధర్నా.. బియ్యం లారీల అడ్డగింత

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్​ గోడౌన్లను ఇతర జిల్లాలకు చెందిన సీఎంఆర్ బియ్యం నిల్వ చేసేందుకు కేటాయించడాన్ని నిరసిస్తూ సుల్తానాబాద్ మండలానికి చెందిన రైస్ మిల్లర్లు మంగళవారం ఆందోళనకు దిగారు. కాట్నపల్లి, సుగ్లాంపల్లి, సుద్దాల, యాదవ నగర్ గోదాముల మిల్లర్లు ధర్నా చేపట్టారు. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా జిల్లాలకు చెందిన రైస్ మిల్లుల సీఎంఆర్ బియ్యాన్ని పెద్దపల్లి జిల్లాలోని గోదాముల్లో నిల్వలు చేసేందుకు ఎఫ్​సీఐ అధికారులు కేటాయించడాన్ని ఖండించారు. ఆయా గోదాముల్లో బియ్యాన్ని అన్​లోడ్ చేసేందుకు వచ్చిన లారీలను అడ్డుకున్నారు. జిల్లాలోని మిల్లులు ఇక్కడి బియ్యానికే సరిపోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తిరుపతి రెడ్డి, విజయపాల్ రెడ్డి, నగునూరి అశోక్, కేశవరావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.