గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి మంజూరైన మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులం, కేజీబీవీ స్కూళ్లు తిమ్మాపూర్ మండలంలో నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండేండ్ల క్రితం గన్నేరువరం మండల కేంద్రంలో కేజీబీవీ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులు, నాయకులతో కలిసి ప్రభుత్వ స్థలాలను, ప్రైవేట్ బిల్డింగులను పరిశీలించారు.
అనుకూలంగా భవనం దొరకకపోవడంతో తిమ్మాపూర్లోనే కేజీబీవీ, మండలంలోని రామకృష్ణ కాలనీలో ఎంజేపీని కొనసాగిస్తున్నారు. దీంతో గన్నేరువరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తిప్పలు తప్పడం లేదు. తమ మండలానికి మంజూరైన స్కూళ్లను తమ మండలంలోనే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
