- వర్షాలు పడకపోయినా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం: ఎమ్మెల్యే సత్యం
హైదరాబాద్, వెలుగు: రైతులను రెచ్చగొట్టేందుకే కేటీఆర్ కరీంనగర్‌లోని లోయర్ మానేర్ డ్యామ్‌ను సందర్శించారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్అయ్యారు. మంగళవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. లోయర్, మిడ్ మానేరు డ్యాంలు సాధారణంగా జులై చివర్లో లేదా ఆగస్టులోనే నీటితో నిండుతాయని చెప్పారు.
వర్షాలు పడకపోయినా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసిందని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో కరువు రావాలని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని విమర్శించారు. కేటీఆర్రైతులపై కపట ప్రేమ చూపిస్తే నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు.
