నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట కెనరా బ్యాంకు దగ్గర మూడు తులాల బంగారం చోరీ చేసింది. నర్సంపేటలో మహిళ చేతి సంచిని కత్తిరించి మూడు తులాల బంగారు ఆభరణాలు అపహరించిన ఘటన నర్సంపేట కెనరా బ్యాంకు దగ్గర జరిగింది.
పర్వతగిరి మండలానికి చెందిన నీలా అనే మహిళ స్థానిక బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని సంచిలో పెట్టుకుని వెళుతుండగా చోరీ జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కెనరా బ్యాంక్ దగ్గర సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తులం బంగారం లక్ష దాటిపోవడంతో అంతర్రాష్ట్ర ముఠాలతోపాటు స్థానిక దొంగలు మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒక్క స్నాచింగ్ చేస్తే తక్కువలో తక్కువ రూ.2 నుంచి రూ.3 లక్షల దాకా చేతికి అందుతుండడంతో చైన్స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బైకులపై మెరుపు వేగంతో వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలు సహా రోడ్డుపై నడిచివెళ్లే వారి మెడలోంచి పుస్తెల తాళ్లు, చైన్లు తెంపుకెళ్తున్నారు.
►ALSO READ | యాదాద్రిలో బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడు
పట్ట పగలే రెచ్చిపోతున్న దొంగలు.. అడ్డొస్తే హత్య చేసేందుకూ వెనుకాడడం లేదు. ముఖ్యంగా ఒంటరి, వృద్ధ మహిళలను టార్గెట్చేసి చంపి మరీ బంగారం ఎత్తుకెళ్తున్నారు. ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉండాలని, ప్రస్తుతం జరుగుతున్న జాతరలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారు నగలు వేసుకొని వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
