యాదాద్రిలో బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడు

యాదాద్రిలో బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడు

యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లోకి గోడ దూకి వచ్చి బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు ఓ దుండగుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు. అడ్డగూడూర్ పోలీసులు పోక్సో నిందితుడిని వదిలేశారంటూ మండిపడ్డారు కుటుంబ సభ్యలు. 

నిందితుడు బాలెంల చైతన్యపై పోక్సో కేసు నంబర్ 94/2026 గా కేసు నమోదయ్యిందని... ఎస్ఐ రిమాండ్ చేయకుండా వదిలేయడంతో నిందితుడు బాలికను తీసుకెళ్లాడని అంటున్నారు కుటుంబసభ్యులు.కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బాలిక కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. బాలిక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

►ALSO READ | రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి : గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి

ఇటీవలే జరిగిన షాబాద్ మారణకాండ మరువక ముందే మరో పోక్సో నిందితుడు అరాచకానికి పాల్పడటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం. పోక్సో నిందితులను పోలీసులు ఎలా వదిలేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకొని బాలికకు న్యాయం చేయాలని... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు ప్రజలు.