టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. ఫస్ట్ బౌలింగ్ ఇండియాదే

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. ఫస్ట్ బౌలింగ్ ఇండియాదే

IND vs ENG: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న వన్డే సిరీస్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఈ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. టాస్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు తమ వ్యూహాలు, జట్టు కాంబినేషన్ల గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. రాబోయే టోర్నీల దృష్ట్యా రెండు జట్లకు కూడా భవిష్యత్తు సన్నద్ధతకు ఈ సిరీస్ ఎంతో కీలకమైనదని రెండు టీమ్స్ కెప్టెన్లు పేర్కొన్నారు. 

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే మొదట బౌలింగ్ చేయాలనే అనుకున్నాం, కాబట్టి టాస్ ఓడిపోవడం వల్ల తమ ప్రణాళికలకు ఎలాంటి నష్టం లేదని అన్నాడు. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఇప్పటికే టీ20 సిరీస్‌ ఆడి మంచి లయలో ఉన్నారని, మిగిలిన వారు కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించి నేటి మ్యాచ్‌కు సిద్ధమయ్యారు.. రాబోయే పెద్ద టోర్నీల దృష్ట్యా తమకు ఇది చాలా ముఖ్యమైన సిరీస్ అని, భవిష్యత్తు సన్నద్ధత ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని గిల్ స్పష్టం చేశాడు.

ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. పిచ్ బ్యాటింగ్‌కు ఎంతో అనుకూలంగా కనిపిస్తోందని, మొదట బ్యాటింగ్ చేసి బోర్డుపై భారీ స్కోరు ఉంచడమే తమ లక్ష్యమని చెప్పాడు. రెండో ఇన్సింగ్స్ సమయంలో పిచ్ నుంచి స్పిన్నర్లకు టర్న్ లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ పరిస్థితులను వీలైనంత త్వరగా అంచనా వేసి ఆడటం కీలకమని బ్రూక్ అభిప్రాయపడ్డాడు. టీ20, వన్డే ఫార్మాట్లలో దాదాపు ఒకే రకమైన ఆటగాళ్లు ఉండటంతో కెప్టెన్‌గా తనకు, అలాగే ఆటగాళ్లకు పరస్పర నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని చెప్పాడు. గత రెండేళ్లుగా వన్డేల్లో తమ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోయినప్పటికీ, ఈ సిరీస్ ద్వారా కొత్త అధ్యాయాన్ని లిఖించి మళ్లీ విజయాల బాట పడతామని బ్రూక్ ధీమా వ్యక్తం చేశాడు.  

ALSO READ : మెస్సీని కట్టడి చేస్తాం.. ఫైనల్‎కు వెళ్లేది ఇంగ్లండే

ఇరు జట్లు:
ఇంగ్లండ్: జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కుర్రాన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ