ఇంగ్లండ్ : క్రి కెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్ - ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మంగళవారం ప్రారంభం కానుంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరగబోయే ఈ తొలి వన్డే మ్యాచ్‌తో టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీ-ఎంట్రీ ఇస్తున్నారు.
ఇటీవల ముగిసిన టీ20 పర్యటనలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత్.. ఈ సిరీస్ ద్వారా తిరిగి విజయాల బాట పట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ వన్డే కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఆల్‌రౌండర్ జాకబ్ బెతెల్‌ను బెన్ డకెట్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దింపడం విశేషం. వికెట్‌కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఈ మ్యాచ్‌తో తన 200వ వన్డే ఆడనున్నాడు. తొలి వన్డే అనంతరం జులై 16న కార్డిఫ్‌లో, జులై 19న లార్డ్స్‌లో మిగతా రెండు వన్డేలు జరగనున్నాయి.
