ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణికి హాజరయ్యే అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పలువురు అధికారులు సెల్ ఫోన్లో వీడియోలు చూస్తూ, చాటింగులు చేస్తూ, హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ కాలక్షేపం చేశారు.
అధికారుల తీరుపై గతంలో అడిషనల్ కలెక్టర్ అసహనం వ్యక్తం చేసినా వారి తీరు మారడంలేదు. ఈ నిర్లక్షంపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. - వెలుగు ఫొటోగ్రాఫర్ కరీంనగర్
