ఆదిలాబాద్ టౌన్, వెలుగు: రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి వారిపై కనికరం లేదని, రైతుల కోసం రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు రైతు యాత్ర చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పాయల్‌శంకర్ అన్నారు.
సోమవారం ఆదిలాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఫసల్ మీమా యోజన అమలు కోసం బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
