ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక వాగులు, చెరువులు, ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. అయితే ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడి వరద నీరు జిల్లాలోని పెనంగా నదికి చేరుతోంది.
జైనథ్ మండలం లోని డోప్టాల్ గ్రామం వద్ద పెన్ గంగా నది వరద ప్రవాహంతో కళకళలాడుతోంది. ఈ నీటితో చనాఖాకొరటా ప్రాజెక్టులోనూ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జిల్లాలో వర్షాభావ పరిస్థి తుల వేళ.. ఎగువ నుంచి పెనంగా నదికి వరదనీరు చేరడం ఊరట కలిగిస్తోంది.
