పెద్దపల్లి: ముగిసిన శ్రీ ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాలు

పెద్దపల్లి: ముగిసిన శ్రీ ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాలు
  •     అగ్ని గుండాల వద్ద నిరసన వ్యక్తం చేసిన భక్తులు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయంలో మూడు రోజులుగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు, అగ్నిగుండాల కార్యక్రమం సోమవారం తెల్లవారు జాముతో ముగిసింది.  ఎమ్మెల్యే విజయరమణారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.  భక్తులు వేలాదిగా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. 

పెద్ద పట్నంతో  అగ్నిగుండంలో నడిచేందుకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండగా కార్యక్రమాన్ని నిర్వాహకులు నిలిపివేయడంతో భక్తులు నిరసన తెలిపారు. టికెట్​తీసుకొని రాత్రి 2 గంటల నుంచే క్యూలో నిల్చున్నప్పటికీ అవకాశం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డామని భక్తులు తెలిపారు.