- అరెస్ట్ చేసిన పోలీసులు
హుజురాబాద్, వెలుగు: కరీంనగర్జిల్లా హుజురాబాద్ లో చింత సునీత(35) హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ మాధవి సోమవారం తెలిపారు. హత్య జరిగిన 36 గంటల్లోనే ఈ కేసును ఛేదించినట్లు చెప్పారు. సోమవారం హుజురాబాద్ పోలీసు స్టేషన్లో కేసు వివరాలను ఆమె వెల్లడించారు. మండలంలోని పోతిరెడ్డిపేటకు చెందిన చింత సునీత(35) కొంతకాలంగా హుజురాబాద్ మామిండ్లవాడలో నివాసం ఉంటోంది. ఆమె భర్త కుమార్ గతంలోనే చనిపోగా, గత ఐదేండ్లుగా మోతే కిరణ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తూ మామిండ్లవాడ గ్యాస్ గోదాం సమీపంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారి పక్కింట్లోని మజోతు భాగ్యతో సునీత స్నేహం పెంచుకొని తరచూ కలిసి తిరుగుతుండడంతో సునీత వ్యభిచారం చేస్తోందని కిరణ్ అనుమానం పెంచుకున్నాడు.
దీంతో వారిద్దరి మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఇదిలా ఉండగా ఈ నెల 10న కిరణ్, సునీత కలిసి మద్యం తాగారు. ఈ విషయమై వారి మధ్య మళ్లీ గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన కిరణ్.. సునీత గొంతు నులిమి హత్య చేశాడు. తనపై అనుమానం రాకుండా డెడ్‌బాడీని ముతోజు భాగ్య ఇంటి సమీపంలోని బావిలో పడేసి కరీంనగర్‌కు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కిరణ్సోమవారం హుజురాబాద్ కు వచ్చినట్లు తెసుకొని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడి, అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరినట్లు ఏసీపీ తెలిపారు.
