ఓపీఎస్కు అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించాలి..ప్రభుత్వానికి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ల‌‌‌‌చ్చిరెడ్డి విజ్ఞప్తి

ఓపీఎస్కు అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించాలి..ప్రభుత్వానికి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ల‌‌‌‌చ్చిరెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోనూ ఓపీఎస్​కు అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.ల‌‌‌‌చ్చిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం సోమ‌‌‌‌వారం  కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్​)లో ఉన్న కొంతమంది ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం (ఓపీఎస్​)లోకి మారేందుకు అవకాశం కల్పించిందన్నారు.  ఏపీ త‌‌‌‌ర‌‌‌‌హాలో తెలంగాణ‌‌‌‌లోనూ సీపీఎస్​ నుంచి ఓపీఎస్​ కు ఉద్యోగులు మారేందుకు అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పిస్తూ ప్రభుత్వం జీవో తేవాల‌‌‌‌ని కోరారు.

 ఇదే కాకుండా ప్రస్తుతం సీపీఎస్‌‌‌‌లో ఉన్న ఉద్యోగులంద‌‌‌‌రికీ ఓపీఎస్‌‌‌‌గా మార్చాల‌‌‌‌న్నారు.  సెప్టెంబ‌‌‌‌రు 1, 2004 కు ముందు నియామక నోటిఫికేషన్ లేదా ప్రకటన వెలువడిన పోస్టులకు చాలా మంది ఎంపిక‌‌‌‌య్యార‌‌‌‌న్నారు. అయిన‌‌‌‌ప్పటికీ వీరంతా కూడా సీపీఎస్‌‌‌‌లోనే ఉన్నట్టుగా గుర్తు చేశారు.  వీరందరికీ ఓపీఎస్​ ఎంచుకునే వీలు కల్పించాల‌‌ని డిమాండ్​ చేశారు.