న్యూఢిల్లీ: తమిళనాడులో గోవధ నిషేధం అంశంపై విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలకు సవరణ అవసరమని పేర్కొంటూ.. బక్రీద్ పండుగతో పాటు ఇతర రోజుల్లో గోవధ జరగకుండా చూడాలన్న ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. పాల ఉత్పత్తిని పెంచడానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి 1976లో జారీ చేసిన ఒక ఉత్తర్వు ఆధారంగా జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ వి లక్ష్మీనారాయణన్తో కూడిన బెంచ్ రాష్ట్రవ్యాప్తంగా గోవధను నిషేధించాలంటూ మే 27న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ విజయ్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా తీర్పు వెలువరించింది.
