మెనూ ప్రకారం ఆహారం అందించాలి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

మెనూ ప్రకారం ఆహారం అందించాలి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

మొగుళ్లపల్లి/ చిట్యాల, వెలుగు : విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ఎంజేపీ స్కూల్లో వైద్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ నూలి పురుగుల దినోత్సవం సందర్భంగా స్టూడెంట్స్​కు ఆల్బెండజోల్ మెడిసిన్​ను అందించారు. అనంతరం స్టూడెంట్స్ తో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్స్ లక్ష్యాన్ని ఎంచుకొని చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. 

అనంతరం ఎంపీడీవో ఆఫీస్ లో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 26 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందించారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఎల్లారెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా, ఎంజేపీ స్కూల్ లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ప్రిన్సిపల్ శారద ఎమ్మెల్యేకు వివరించగా, త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే టేకుమట్ల మండలంలోని ఆయా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.