కాశీబుగ్గ/ పర్వతగిరి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో దేశ్‌పాండే ఫౌండేషన్, దాతల సహకారంతో రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన స్కిల్ ప్లస్ కంప్యూటర్ ట్రైనింగ్ ను ఆమె కలెక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్నతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు వారు కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. యువత నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
అనంతరం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నెహ్రూ మెమోరియల్ పాఠశాల విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రలు మంత్రి, కలెక్టర్, బల్దియా కమిషనర్ అందించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి ఎంపీపీఎస్ స్కూల్లో హెచ్ఎం వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్బండజోల్ మాత్రాలను అందజేశారు.
