హైదరాబాద్, వెలుగు: కొలంబియాలోని బుకారామంగాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 56వ ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్–2026లో నారాయణ విద్యాసంస్థల స్టూడెంట్ శ్రేష్ఠ్ సురయ చరిత్ర సృష్టించాడు. భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన అతడు అద్భుత ప్రతిభతో గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్–2026 ఫలితాల్లో శ్రేష్ఠ్ సురయ ఆల్ ఇండియా 58వ ర్యాంక్ సాధించి అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడని తెలిపింది.
ఈ డబుల్ అచీవ్‌మెంట్ తమ విద్యాసంస్థల ప్రపంచస్థాయి శిక్షణకు, విద్యార్థి అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంది. ఇంతటి ఘనవిజయంపై నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ సింధూర నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. శ్రేష్ఠ్ సురయను చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు. ఇది అతడి కృషికి, పట్టుదలకు దక్కిన గౌరవమని వెల్లడించారు.
ఈ గెలుపు నారాయణ కుటుంబానికే కాకుండా దేశ మొత్తానికి గర్వకారణమని ప్రశంసించారు. నారాయణ విద్యాసంస్థల్లో తాము కాన్సెప్చువల్ లెర్నింగ్, వ్యక్తిగత పర్యవేక్షణ ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని వివరించారు. నారాయణ ఒలింపియాడ్ శిక్షణ విధానం విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేలా చేస్తుందని స్పష్టం చేశారు.
