అమెజాన్ ప్రైమ్ డే సేల్లో..తెలంగాణ నుంచి భారీగా ఆర్డర్లు

అమెజాన్ ప్రైమ్ డే సేల్లో..తెలంగాణ నుంచి భారీగా ఆర్డర్లు

హైదరాబాద్​, వెలుగు: ఇటీవలి పదో ఎడిషన్ ప్రైమ్ డే సేల్​లో తెలంగాణ నుంచి భారీగా ఆర్డర్లు వచ్చాయని అమెజాన్​  తెలిపింది.  ప్రైమ్ సభ్యులు స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ కిచెన్ వస్తువులను భారీగా కొన్నారు. కొత్తగా చేరిన వారిలో 70 శాతం మంది చిన్న నగరాలవాసులు ఉన్నారు. అమెజాన్ నౌ సేవలు ఉన్న నగరాల్లో ప్రతి రెండు ఆర్డర్లలో ఒకటి కేవలం కొన్ని నిమిషాల్లోనే డెలివరీ అయింది.  అమెజాన్ నౌ అమ్మకాలు సాధారణ రోజుల కంటే 1.5 రెట్లు పెరిగాయని అమెజాన్​ తెలిపింది.