కోల్బెల్ట్/దండేపల్లి, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సోమవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. అనారోగ్యంతో చనిపోయిన రామకృష్ణాపూర్‌కు చెందిన ఐఎన్టీయూసీ సీనియర్ నేత తేజావత్ రాంబాబు, దండేపల్లి మండలంలోని లింగాపూర్‌లో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మందమర్రి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బానోత్ నీలయ్య తండ్రి నరసింహ కుటుంబాలను మంత్రి పరామర్శించారు.
మృతుల ఫొటోలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీటీసీ పుల్లూరి కల్యాణ్ ఇంటిని సందర్శించారు. మంత్రి వెంట డీసీసీ ప్రెసిడెంట్రఘునాథ్ రెడ్డి, రాష్ట్ర లీడర్ బండి సదానందం యాదవ్, మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, మేదరిపేట మాజీ సర్పంచ్ చీటీ జ్యోతి సత్యంరావ్, మాజీ ఎంపీటీసీ ముత్తె రాజన్న, తాళ్లపేట ఉప సర్పంచ్ పుట్టపాక తిరుపతి తదితరులు ఉన్నారు.
బీఎల్వోకు చీరను అందించిన మంత్రి
ప్రజల సహకారంతో సర్ సర్వే పూర్తి చేసేందుకు బీఎల్ఓలు కృషి చేయాలని మంత్రి వివేక్ సూచించారు. మందమర్రిలోని 22 వార్డు పరిధిలో సర్సర్వేను సక్సెస్ చేయడంలో కృషి చేసిన బీఎల్వో రజితకు ప్రోత్సాహకంగా చీర అందజేశారు. తహసీల్దార్సతీశ్కుమార్, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపల్కమిషనర్లు రాజలింగు, మారుతీ ప్రసాద్, స్థానిక లీడర్లు పాల్గొన్నారు.
