- బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుంచి వచ్చినయ్?
- ఆ సొమ్మును అమరుల కుటుంబాలకే పంచండి
- కేసీఆర్, హరీశ్రావులవి శవ రాజకీయాలు
- అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఫైర్
- ఎల్బీనగర్ టిమ్స్‌కు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి
- ఉద్యమకారుల సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయాలి: కేకే కమిటీకి ఉద్యమకారుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి, ప్రస్తుత మహిళా కమిషన్ సభ్యురాలు శంకరమ్మ మండిపడ్డారు. తెలంగాణ బిడ్డల బలిదానాలను గుర్తించి సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇస్తే.. పదేండ్లు అధికారం చేసిన కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్లు వెనకేసుకుందని ఆరోపించారు. ‘‘రాష్ట్రం రాకముందు ల్యాండ్ లైన్ ఫోన్ బిల్లులు కట్టడానికి, ఆఫీస్ బాయ్‌కి జీతాలివ్వడానికి గతిలేని బీఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు రూ.1,400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అదంతా అమరవీరుల రక్తం కాదా? ఆంధ్రా కాంట్రాక్టర్ల నుంచి జమ చేసుకున్న ఆ కోట్ల రూపాయల సొమ్మును దిక్కులేని అనాథలుగా మారిన అమరవీరుల కుటుంబాలకే పంచాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ ఉద్యమకారుల కమిటీని కలిసిన అనంతరం శంకరమ్మ మీడియాతో మాట్లాడారు. శవాల మీద రాజకీయాలు చేయడం, ఆత్మహత్యలను రెచ్చగొట్టడం హరీశ్‌రావుకు, ఆయన మామ కేసీఆర్‌కు అలవాటేనని విమర్శించారు.
గత పదేండ్ల పాలనలో అమరవీరుల త్యాగాలను విస్మరించిన నాయకులు, నేడు తమ రాజకీయ ఉనికి కోసం మాట్లాడుతున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం.. సీఎం రేవంత్‌రెడ్డి తనకు మహిళా కమిషన్‌లో అవకాశం కల్పించి, ఉద్యమకారులను గుర్తించారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సిద్దిపేటలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని, అగ్గిపెట్టె దొరకలేదంటూ హరీశ్‌రావు ఆడిన డ్రామాను నమ్మే తన బిడ్డ శ్రీకాంతాచారి సహా ఎంతో మంది తెలంగాణ బిడ్డలు నిలువునా దహనమైపోయారని శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నో జిల్లాలు, కాలేజీలు పెట్టినా.. శ్రీకాంతాచారి పేరు ఒక జిల్లాకు పెట్టాలని అడిగితే, ‘‘అసలు శ్రీకాంతాచారి ఏం చేసి వచ్చాడు’’ అని అవహేళన చేసిన నాయకులు ఆ రోజుల్లో ఉన్నారని గుర్తుచేశారు. గతంలో కనీసం సీఎంను, మంత్రులను కలవడానికి కూడా సమయం ఇవ్వలేదన్నారు.
రేవంత్ రెడ్డి పాలనలోనే ఉద్యమకారులకు న్యాయం
ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేయ డం సీఎం రేవంత్ రెడ్డికే చేతనైందని.. పదేండ్లు అధికారంలో ఉండి కోదండరాం సార్‌ను జైల్లో వేస్తే, రేవంత్ రెడ్డి ఆయనను ఎమ్మెల్సీని చేశారని శంకరమ్మ కొనియాడారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చారని, ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రత్యేక కమిటీ వేశారని తెలిపారు. సెక్రటేరియెట్ సాక్షిగా 9 మంది తెలం గాణ పోరాట యోధులకు రూ.కోటి చొప్పున ఆర్థిక సాయంతోపాటు ఇండ్ల స్థలాలు ఇచ్చి గౌరవించార ని, మిగిలిన అమరవీరుల కుటుంబాలకు కూడా త్వరలోనే మంచి అవకాశాలు వస్తాయన్న నమ్మకం తనకుందన్నారు. ఈ సందర్భంగా ఎల్‌బీనగర్‌లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రికి శ్రీకాంతాచారి పేరు పెట్టాలని, అలాగే జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని సీఎంకు శంకరమ్మ విజ్ఞప్తి చేశారు.
ఉద్యమకారుల సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయాలి
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించడంతో పాటు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేష న్లు, ఉచిత ఇండ్లస్థలాలు, పెన్షన్, ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలని ఆయా జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులు డిమాం డ్ చేశారు. ఈ మేరకు ‘‘తెలంగాణ ఉద్యమ కారుల గుర్తింపు కమిటీ’’ సోమవారం అమ రవీరుల స్మారక చిహ్నం కార్యాలయంలో రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ఉద్యమకారులతో నిర్వహించిన ముఖాముఖి సమీక్ష సమావేశం నిర్వహిం చింది. కమిటీ చైర్మన్ కె.కేశవరావు నేతృ త్వంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి భేటీలో సభ్యులు ఎమ్మెల్సీకోదండరామ్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మోతె శోభన్ రెడ్డి, ఎస్.రాములు నాయక్ తదితరులు హాజరై, మూడు జిల్లాల నుంచి తరలివచ్చిన ఉద్యమకారుల సలహాల ను, సూచనలను స్వీకరించారు.
