- టెట్ లో సగం మంది కూడా క్వాలిఫై కాలె..
- 1.15 లక్షల మంది పరీక్ష రాస్తే 50,544 మందే పాస్
- ఇన్ సర్వీస్ టీచర్లు 37.29శాతం మందే..
- రిజల్ట్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్
టీజీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన వారిలో సగం మంది క్వాలిఫై కాలేదు. మొత్తం 43.94% మంది పాసయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,15,028 మంది పరీక్ష రాయగా.. 50,544 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. పేపర్-1లో 65.29% మంది క్వాలిఫై అయ్యారు. 78,899 మంది పరీక్ష రాస్తే.. 26,954 మంది అర్హత సాధించారు.
హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టీజీ టెట్-) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన వారిలో సగం మంది కూడా క్వాలిఫై కాలేదు. మొత్తం 43.94 శాతం మంది పాసయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌లో టెట్ కన్వీనర్ జి.రమేశ్, టెట్ డైరెక్టర్ రేవతిరెడ్డితో కలిసి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఫలితాలను రిలీజ్ చేశారు. 1,15,028 మంది పరీక్ష రాయగా.. కేవలం 50,544 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు నిర్వహించిన పేపర్1లో 65.29 శాతం మంది క్వాలిఫై అయ్యారు.
మొత్తం 36,129 మంది హాజరుకాగా 23,590 మంది పాస్ అయ్యారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించిన పేపర్ 2లో 78,899 మంది పరీక్ష రాస్తే.. 26,954 మంది అర్హత సాధించారు. మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగంలో 44,128 మంది పరీక్ష రాయగా 17,987 (40.76%) మంది క్వాలిఫై అయ్యారు. సోషల్ స్టడీస్ విభాగంలో 34,771 మంది రాయగా కేవలం 8,967 (25.79%) మంది అర్హత సాధించారు.
ఇన్ సర్వీస్ టీచర్లు 37.29శాతం మందే..
ఇన్ సర్వీస్ టీచర్ల ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. 23,623 మంది పరీక్ష రాయగా, 8,809 మంది (37.29%) క్వాలిఫై అయ్యారు. పేపర్-1లో 52.57 శాతం ఉత్తీర్ణత సాధించగా, పేపర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో 38.27 శాతం, సోషల్‌లో అత్యల్పంగా 24.05 శాతం పాస్ అయ్యారు.
