ఆరుగురిని చంపిన ఉన్మాది రాజ్ కుమార్ సూసైడ్

ఆరుగురిని చంపిన ఉన్మాది రాజ్ కుమార్  సూసైడ్
  • ఆరుగురిని చంపిన ఉన్మాది సూసైడ్​
  • కొత్తూరు పెంజర్లలోని ఓ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కిల్లర్ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీ
  • గడ్డిమందు తాగి చనిపోయిన ఆనవాళ్లు
  • స్మార్ట్​ ఫోన్​లో సెల్పీ వీడియో, జేబులో సూసైడ్​ నోట్​
  • మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్టమ్​

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాబాద్​లో అత్యంత కిరాతకంగా ఆరుగురిని చంపిన ఉన్మాది రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(29) ఆత్మహత్య చేసుకున్నాడు. గడ్డి మందు తాగి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలోని ఓ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రహరీ సమీపంలో సోమవారం మధ్యాహ్నం అతని డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్​కు చేరుకుని మృతదేహాన్ని నిర్ధారించుకున్న అనంతరం అతడి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్న  భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిలిపించారు. ప్రొసీజర్ ప్రకారం కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీ పక్కన పురుగుల మందు బాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్మార్ట్​ ఫోన్​, రెండు 500 రూపాయల నోట్లు, కొంత చిల్లర, బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దగ్గుకు సంబంధించిన ట్యాబ్లెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్టం కోసం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

శనివారం తెల్లవారుజామున తిమ్మాపూర్ రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోరంగారెడ్డి జిల్లా షాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దైవాలగూడలో భార్యపిల్లలు, బాలిక, ఆమె తల్లి నానమ్మ సహా ఆరుగురిని శుక్రవారం అర్ధరాత్రి రాజ్​కుమార్​ అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అరగంట వ్యవధిలో ఆరుగురిని హతమార్చిన అనం తరం రాజ్‌‌కుమార్‌‌‌‌ అక్కడి నుంచి పారిపోయాడు. చివరిగా తన తండ్రి అరుణ్‌‌ కుమార్‌‌‌‌కు ఫోన్‌‌ చేశాడు. ఆరుగురిని చంపానని.. తాను కూడా చనిపోతున్నానని చెప్పాడు. ఆ తర్వాత మొబైల్ స్విచాఫ్‌‌ చేసి కనిపించకుండా పోయాడు. పరారీలో ఉన్న రాజ్‌‌కుమార్‌‌‌‌ కోసం ఫ్యూచర్ సిటీ పోలీసులు 16 స్పెషల్‌‌ టీమ్స్‌‌తో గాలించారు. శనివారం తెల్లవారుజామున తిమ్మాపూర్‌‌‌‌లోని రైల్వేస్టేషన్‌‌లో తిరిగినట్టు సీసీటీవీల కెమెరా ఫుటేజ్‌‌ల ద్వారా గుర్తించారు. శ్రీశైలం లేదా -బెంగళూరుకు వెళ్లాడనే అనుమానంతో హైవేల్లోని లాడ్జీలు, దాబాల్లో సోదాలు చేశారు. బంధువులు, స్నేహితులను ఆరా తీశారు.

కొత్తూరు పెంజర్లలోని వెంచర్‌‌‌‌లో సూసైడ్ 

రాజ్​కుమార్​ను వెతికే క్రమంలో రాష్ట్ర పోలీసులు కర్నాటక పోలీసుల సహకారం కూడా తీసుకున్నారు. ఓఆర్‌‌‌‌ఆర్‌‌ పరిసర ప్రాంతాలతో పాటు బెంగళూరు హైవేలోని శంషాబాద్‌‌, కొత్తూరు, షాద్‌‌నగర్‌‌లోని నిర్మానుష్య ప్రాంతాల్లో గాలించారు. ఈ ‌‌‌‌ క్రమంలో సోమవారం మధ్యాహ్నం డయల్ 100కు ఫోన్ కాల్‌‌ వచ్చింది. కొత్తూరు సమీపంలోని పెంజర్లలో గల ఓ ప్రైవేట్​ వెంచర్‌‌‌‌లో డెడ్‌‌బాడీని గుర్తించినట్టు స్థానికులు తెలిపారు. దీంతో  పోలీసులు అక్కడికి వెళ్లి డెడ్‌‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. కాగా. పెంజర్లలో రాజ్‌‌కుమార్‌‌‌‌ మేనమామ ఉంటున్నట్టు తెలిసింది. ఘటనా స్థలాన్ని ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్‌‌ జోషి, చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ సహా పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. మృతదేహం వద్ద క్లూస్ టీమ్‌‌ అధికారులు శాంపిల్స్ సేకరించారు. పురుగుల మందు బాటిల్ సహా, బ్లడ్ శాంపిల్స్​ సేకరించారు. అనంతరం రాజ్‌‌కుమార్‌‌‌‌ డెడ్‌‌బాడీని చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు.

సెల్ఫీ వీడియో, సూసైడ్​ నోట్‌‌..

ఆరు హత్యలు చేసిన రోజు రాజ్‌‌కుమార్ రికార్డ్‌‌ చేసిన సెల్ఫీ వీడియోను సీపీ తరుణ్‌‌ జోషి మీడియాకు చూపించారు. హత్యలకు ఒకరోజు ముందు ఈ నెల 10వ తేదీ సాయంత్రం 4:55 గంటల ప్రాంతంలో దీనిని రికార్డ్ చేసినట్టు వెల్లడించారు. కాగా, నిమిషం 15 సెకన్లు రికార్డ్‌‌ చేసిన సెల్ఫీలో అందరినీ చంపి తాను చనిపోతానని రాజ్‌‌కుమార్‌‌‌‌ తెలిపాడు. సెల్పీ వీడియోతో పాటు రాజ్‌‌కుమార్ రాసిన నాలుగు పేజీల లెటర్‌‌‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.100 బాండ్‌‌ పేపర్‌‌పై నాలుగు పేజీల నోట్‌‌లో వివరాలు వెల్లడించాడు. మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి, నానమ్మ తనను మోసం చేశారని, రూ.50 లక్షలు డిమాండ్‌‌ చేసి ఇవ్వకపోవడంతో పోలీస్‌‌ కేసు పెట్టించారని పేర్కొన్నాడు. సంగీత, నరేందర్, శ్రీను కూడా తన చావుకు కారణమని రాశాడు. “నామీద కేసు పెట్టి జైలుకు పంపాలని చూస్తున్నరు. అక్షయని, వాళ్ల నానమ్మని, అమ్మని ఎలాగైనా చంపి.. నేను నా కుటుంబం ఏమైనా చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్న. దీంట్లో నా కుటుంబం పాత్ర లేదు. నేను ఒక్కడినే నా సొంత నిర్ణయం తీసుకున్న. నేను నా కుటుంబం చనిపోతే.. నాకు భూమి లేదు కాబట్టి నా తల్లిదండ్రుల భూమిలో నన్ను పాతిపెట్టవద్దు. మమ్ములను అనాథల్లాగా శ్మశానంలో కాల్చేయాలని తెలియజేస్తున్నాను. నేను చేసుకున్న తప్పుకు నేనే శిక్ష అనుభవిస్తున్న”  అని సెల్ఫీ వీడియోలో రాజ్‌‌కుమార్‌‌‌‌ తెలిపాడు.

మేఘనకు రూ.10 లక్షల ఆర్థిక సాయం

షాబాద్ ఘటనలో అనాథగా మిగిలిపోయిన బాలిక అక్క మేఘనకు అండగా ఉంటామని మండలి చీఫ్​ విప్ పట్నం మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య, కలెక్టర్ నారా యణ రెడ్డి, సీపీ తరుణ్​ జోషితో కలిసి రూ.10 లక్షల చెక్కును ఆమెకు అందజేశారు. మేఘన పరిస్థితి తెలుసుకున్న సీఎం రేవంత్‌‌రెడ్డి ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారని  మహేందర్‌‌‌‌రెడ్డి తెలిపారు. అలాగే, ఇందిరమ్మ ఇల్లుతోపాటు మానసిక వికాసం కోసం  సికింద్రాబాద్ పునరావాస కేంద్రంలో చేర్పిస్తామని చెప్పారు.  నిందితుడికి పోలీ సులు సహకరించారని బాలిక మేనమామ నరేశ్​వారి దృష్టికి తేగా.. అది తేలితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ తెలిపారు.

వాడిని కాల్చి చంపేదుండే: రాజ్‌‌కుమార్‌‌‌‌ అన్న భాస్కర్

‘వాడు ప్రశాంతంగా సచ్చిండు.. దొరకబట్టి కాల్చి సంపేదుండే’ అని రాజ్‌‌కుమార్‌‌‌‌ అన్న భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్థాని కుల సమాచారం మేరకు పోలీసులతో పెంజర్లలో ఘటనా స్థలానికి భాస్కర్‌‌‌‌ వచ్చా డు. డెడ్​బాడీని చూసిన భాస్కర్​ బోరున విలపిస్తూనే.. ఆవేశంగా తిట్టడం ప్రారంభిం చాడు. ‘‘వీడు సింపుల్‌‌గా, ప్రశాంతంగా చచ్చిండు.. కాల్చి సంపేందుండే సార్, పిల్లలు ఏమన్నార్రా.. నేనన్న పెంచుకుం టుంటి. వాళ్లు సచ్చినట్టే వీడు సచ్చేదుండే. ఇంత మూర్ఖుడని కలలో కూడా ఊహిం చలేదు.. అందరి జీవితాలు ఆగంజేసిండు.  పురుగుల మందు తాగినప్పుడు చచ్చిపో యి ఉంటే ఇంత దారుణం జరుగకుండే” అని ఆవేదన వ్యక్తం చేశాడు.

రాజ్​కుమార్​ డెడ్​బాడీ మాకొద్దు

రాజ్​కుమార్ డెడ్​బాడీని తీసుకెళ్లేందుకు కుటుం బ సభ్యులు నిరాకరించారు. దీంతో పోలీసులు చేవెళ్ల శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు. సోమవారం సాయంత్రం 6.15 గంటలకు రాజ్​కుమార్ డెడ్ బాడీని పోలీసులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తీసుకొచ్చారు. అయితే, కుటుంబ సభ్యులు ఒకరు ఉండాల్సి ఉండగా 9.30 గంటల వరకు వెయిట్​ చేశారు. అయినా ఎవరూ రాలేదు. చివరగా వారిని సంప్రదించగా.. నిందితుడి తల్లిదండ్రులైన అరుణ్​ కుమార్​ దంపతులు, సోదరుడు భాస్కర్ వచ్చారు. అయితే, తాము డెడ్​బాడీని తీసుకెళ్లమని రాసి ఇచ్చారు. రాత్రి 10.30 గంటలకు పోస్టుమార్టం పూర్తయ్యిం ది. ఆ తర్వాత కూడా ఇంటికి తీసుకెళ్తారా? అని అడగగా వాళ్లు నిరా కరించారు. కడసారిచూసి వెళ్లిపోయారు. దీంతో  పోలీసులు స్థానికుల సాయంతో చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని మల్లన్నగట్టు దగ్గర ఉన్న శ్మశాన వాటికలో రాజ్​ కుమార్ డెడ్ బాడీకి అంత్యక్రియలు నిర్వహించారు.