ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. 2026, జూలై 24 వరకు సర్ డేట్ ఎక్స్టెండ్ చేసింది. వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ అభ్యర్థన మేరకు మంగళవారం (జూలై 14) సవరించిన కొత్త షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ.
కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఇంటింటి సర్వే జూలై 24వ తేదీ వరకు కొనసాగనుంది. అంటే.. 24వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులు (BLO) ప్రతి ఇంటికీ వచ్చి ఓటర్ల వివరాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయనుంది ఈసీ. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 28వ తేదీ లోగా అభ్యంతరాలను పరిష్కరించనుంది. అక్టోబర్ 3వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనుంది.
ALSO READ : రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల దరఖాస్తులు పెండింగ్ లో ఉండటం.. అర్హలైన వారి పేరు జాబితాలో లేకపోవటం.. తప్పులు సరిదిద్దటం ఆలస్యం కావటం వంటి కారణాలతో.. గడుపు ముగుస్తున్నా ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఓటర్లలో ఆందోళన నెలకొంది. ఈ పరిణామాలు అన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎన్నికల కమిషన్.. సర్ గడువును 10 రోజులు పొడిగిస్తూ.. కొత్త తేదీలతో షెడ్యూల్ రిలీజ్ చేసింది.
