ఏపీలోని సింగరాయకొండలో విషాదం... రైలు కిందపడి కుటుంబం ఆత్మహత్య...ఏపీలోని ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సింగరాయకొండలో ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇటీవల సంచలనం రేపిన ఏవో శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరికృష్ణ తన కుటుంబంతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. మంగళవారం ( జులై 14 ) సింగరాయకొండ దగ్గర జరిగింది ఈ ఘటన.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
►ALSO READ | పల్నాడులో విషాదం.. ఇద్దరు పిల్లలకు విషం పెట్టి చంపి తల్లి ఆత్మహత్య
ఆస్తి కోసం బావ అయిన శ్రీహరిని హత్య చేశాడు హరికృష్ణ. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన హరికృష్ణ కుటుంబంతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.
ఇదిలా ఉండగా... ఏవో శ్రీహరి హత్య కేసుకు సంబంధించి దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్రమంలో బుచ్చిరెడ్డిపాలెం సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేశారు. దీంతో పాటు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ కు చెందిన 23 మంది సిబ్బందిపై బాడీలు వేటు వేశారు.
