ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుడి భుజం సర్జరీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. పవన్ కల్యాణ్‌కు రెండు భుజాల్లో తీవ్రమైన రోటేటర్ కఫ్ గాయాలు గుర్తించగా.. కుడి భుజానికి దాదాపు మూడున్నర గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు . ఎడమ భుజం పరిస్థితిని కూడా నిరంతరం పరిశీలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భార్య అన్నా కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఎమోషనల్ నోట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో పవన్‌ను పరామర్శించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. 'ఆయన జీవితంలో మోస్తున్న బాధ్యతల భారం... ఆయన భుజం నొప్పి కంటే చాలా పెద్దది. ఎంత నొప్పి ఉన్నా బయటకు చెప్పరు. నొప్పి తట్టుకోలేనంతగా మారినప్పుడు మాత్రమే బయటపడతారు అని అన్నా తెలిపారు..
►ALSO READ | Mrunal Thakur: మృణాల్ - రిషబ్ పంత్ మధ్య 'సంథింగ్ సంథింగ్'?.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే ఒక్క 'ఫాలో'తో మొదలైన రచ్చ!
ఇప్పుడు నా బాధ్యతల్లా ఆయన్ని బాగా చూసుకోవడమే.. ఆయన క్షేమంగా ఉన్నారనే నమ్మకాన్ని కలిగించడం. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారు అని ఆమె నోట్ లో రాసుకొచ్చారు. అన్నా పోస్ట్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.'గెట్ వెల్ సూన్ పవన్ సర్', 'మీరు త్వరగా కోలుకుని ప్రజల మధ్యకు రావాలి' అంటూ వేలాది సందేశాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆస్పత్రికి వెళ్లి పవన్‌ను పరామర్శించారు. మరోవైపు, చంద్రబాబు నాయుడు కూడా పవన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వైద్యులతో మాట్లాడారు. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినప్పటికీ, వీలైనంత త్వరగా తిరిగి ప్రజాసేవలోకి రావాలనే ఆతృతను పవన్ వ్యక్తం చేసినట్లు బాబు తెలిపారు. డాక్టర్లు అనుమతించగానే బాధ్యతల్లోకి రావాలని బాబు సూచించారు.
