ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ కొనసాగుతున్న వేళ బులియన్ మార్కెట్లు భేజారాయి. ఇన్వెస్టర్లలో కొనసాగుతున్న గందరగోళంతో పెట్టుబడులకు వెనకాడుతున్నారు. దీంతో బంగారం, వెండి లాంటి లోహాల ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలని అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం బెటర్.
జూలై 16న బంగారం రేట్లు తగ్గాయి. జూలై 15 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.28 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 329గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 135గా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 16, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 40వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.240 దగ్గర ఉంది.
