దుర్గం చెరువులోకి మురుగు రావొద్దు.. CMC కమిషనర్ సృజన ఆదేశం

దుర్గం చెరువులోకి మురుగు రావొద్దు.. CMC కమిషనర్ సృజన ఆదేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: దుర్గం చెరువులోకి మురుగు చేరకుండా చర్యలు తీసుకోవాలని సీఎంసీ కమిషనర్ సృజన ఆదేశించారు. శనివారం ఆమె దుర్గం చెరువును విజిట్​చేశారు. సీఎంసీ, వాటర్ బోర్డు ఉన్నతాధికారులతో కలిసి ఎస్టీపీ, ఇన్ లెట్, ఔట్ లెట్లను పరిశీలించారు. సోమవారం నాటికి మురుగు పూర్తిగా ఎస్టీపీకి మళ్లించాలని, అక్కడ శుద్ధి చేసిన తర్వాతే  చెరువులోకి మళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎస్ఆర్ లో భాగంగా రహేజా సంస్థ ఈ పనులు చూసుకోవాలన్నారు. 

ఎస్‌‌ఎన్‌‌డీపీ బాక్స్ డ్రెయిన్ పనుల కారణంగా దెబ్బతిన్న సీవరేజ్  లైన్‌‌ను పునరుద్ధరించాలని, భవిష్యత్‌‌లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పైప్‌‌లైన్లు నిర్మించాలన్నారు. టీ-హబ్, టీజీఐఐసీ లేఅవుట్ ప్రాంతం నుంచి వస్తున్న మురుగు ప్రవాహాన్ని పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  సోమవారం మరోసారి చెరువుకు వచ్చి పనుల పురోగతిని పరిశీలిస్తానన్నారు.