యాదాద్రి, వెలుగు : నేరాల నియంత్రణలో రాజీ పడితే కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి ఎస్పీ ఆక్షాంక్ష్ యాదవ్ హెచ్చరించారు. ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన క్రైమ్ మీటింగ్‌లో కేసుల నమోదు, దర్యాప్తు, లా అండ్ ఆర్డర్, సైబర్ నేరాల నియంత్రణపై ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటలిజెన్స్ వ్యవస్థ పనితీరుపై ఆయన మాట్లాడారు.
ఇంటలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం కారణంగా నేరాలు జరగకుండా చూడడంలో విఫలమవుతున్నట్టుగా కన్పిస్తోందన్నారు. గ్రామాల్లో ఇంటలిజెన్స్ వ్యవస్థను పటిష్టం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో సీసీ టీవీ నెట్ వర్క్ విస్తరించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ వేగంగా పూర్తి చేసి క్లోజ్ చేయాలని ఆదేశించారు.
సైబర్‌సెల్, ఐటీ సెల్ సమన్వయంగా పని చేసి కేసులను త్వరగా ఛేదించాలని సూచించారు. అంతకుముందు జరిగిన మీటింగ్‌లో అడ్డగూడూరు పీఎస్‌లో పోక్సో కేసు ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలపై సంబంధిత ఆఫీసర్లను ఆయన ప్రశ్నించగా, ఆఫీసర్లు వివరణ ఇచ్చికున్నట్లు తెలిసింది.
