నల్గొండ, వెలుగు: పగలు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ, రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న షాపులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ కందుల సత్యనారాయణ అలియాస్ సత్తిబాబును నల్గొండ టూ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిందితుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో నివసిస్తూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 47 దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ నెల 3న రాత్రి నల్లగొండ రామగిరి ఏరియాలోని హనుమాన్ స్పోర్ట్స్ షాప్ షట్టర్ తాళాలు పగులగొట్టి రూ. 3.40 లక్షల నగదును ఎత్తుకెళ్లగా, బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ టీవీ కెమెరాల ఆధారంగా నార్కెట్‌పల్లి బస్ స్టాండ్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ. 52 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
