- అధికారులకు మెట్రో అడిషనల్ ఎండీ అజిత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మెట్రోలో ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా అదనపు బోగీలను సమకూర్చుకోవాలని, తయారీదారులతో వెంటనే చర్చలు జరపాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మెట్రో భవన్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..మొదటి దశలోని 69 కిలోమీటర్ల మేర ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. మెట్రో స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకునేందుకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని మరింత విస్తరించాలన్నారు.
ఇందుకోసం ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని రవాణా సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రతి మెట్రో స్టేషన్‌కు ఒక లోకల్ ప్లాన్ ఉండాలని, పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని స్టేషన్లను ఎంపిక చేసి ఈ ప్లాన్ అమలు చేయాలని ఆదేశించారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్టీఎస్) రవాణా వ్యవస్థ ప్రతిపాదనల డెవలప్‌మెంట్‌ను ఆయన అడిగి తెలుసుకున్నారు.
