వాహనాల దొంగ అరెస్ట్.. సిద్దిపేటలో వరుస చోరీలు.. నిందితుడిని రిమాండ్ కు తరలింపు

వాహనాల దొంగ అరెస్ట్.. సిద్దిపేటలో వరుస చోరీలు.. నిందితుడిని రిమాండ్ కు తరలింపు

సిద్ధిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పార్క్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న జొన్నల సాయికుమార్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించారు. సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్ బుధవారం కేసు వివరాలను వెల్లడిండారు. 

మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన సాయికుమార్ తన జులాయి ఖర్చుల కోసం వాహనాల దొంగతనాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల దొంగతనానికి గురైన ఆటో కేసును దర్యాప్తు చేస్తుండగా, రామునిపట్ల గ్రామ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు పట్టుబడ్డాడు. అతడి నుంచి రెండు ఆటోలు, ఒక పల్సర్ బైక్, ఒక హోండా యాక్టివా స్కూటీతో కలిపి మొత్తం నాలుగు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకునారు.