టీచర్ల కృషితోనే రాష్ర్టానికి మెరుగైన ర్యాంకు..టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

టీచర్ల కృషితోనే రాష్ర్టానికి మెరుగైన ర్యాంకు..టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: విద్యాశాఖ పకడ్బందీ ప్రణాళికతో పని చేయడం వల్లే సమగ్ర మూల్యాంకనంలో తెలంగాణకు 18వ స్థానం లభించిందని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. సుమారు 200 పారామీటర్ల ఆధారంగా జరిగిన ఈ మూల్యాంకనంలో రాష్ట్రం 29వ స్థానం నుంచి 18వ స్థానానికి రావడం విద్యారంగానికి గర్వకారణమని కొనియాడారు. ఈ పురోగతిలో  టీచర్లు, విద్యాశాఖ అధికారులతో పాటు ప్రభుత్వ సమష్టి కృషి ఉందన్నారు. బుధవారం పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, ఇతర నేతలు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. రాష్ట్రంలోని టీచర్ల అంకితభావంతో కూడిన కృషే ఈ ఫలితానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.