కల్వకుర్తి/ ఆమనగల్లు, వెలుగు : గ్రామీణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు నూతన డయాలసిస్ యూనిట్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రోగులకు సకాలంలో నాణ్యమైన సేవలు అందేలా చూడాలని డాక్టర్లను ఆదేశించారు. అంతకుముందు వెల్దండ మండలం పెద్దపూర్ గ్రామంలో మహిళా శక్తి భవన్, ఇందిరమ్మ గృహాలను ప్రారంభించారు. అనంతరం తలకొండపల్లి మండలం వీరన్నపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
