భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వైద్య సేవలపై స్పెషల్ ఫోకస్

 భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వైద్య సేవలపై స్పెషల్ ఫోకస్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వైద్యసేవలు, సౌకర్యాలపై హెల్త్​ మినిష్టర్ దామోదర రాజ నర్సింహ స్పెషల్​ ఫోకస్​పెట్టారు. బుధవారం జిల్లా ప్రజాప్రతినిధులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం కావడంతో వానా కాలంలో వ్యాధులపై అప్రమత్తతతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది ఖాళీలు, ఇతర పలు అంశాలను ఖమ్మం, మహబూబాబాద్​ ఎంపీలు రఘురామిరెడ్డి, బలరాం నాయక్​తో పాటు ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ మినిష్టర్ దృష్టికి తీసుకువచ్చారు. 

అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి మండలానికి అంబులెన్స్, ఏరియా హాస్పటల్స్​కు దశల వారీగా సీటీ స్కాన్​ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇల్లెందు ఏరియా హాస్పటల్​లో ఐసీయూ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.