మున్నేరు పరిరక్షణ గోడ నిర్మాణ పనులు స్పీడప్ చేయాలి : ఖమ్మం కలెక్టర్ దివాకర

మున్నేరు పరిరక్షణ గోడ నిర్మాణ పనులు స్పీడప్ చేయాలి :  ఖమ్మం కలెక్టర్ దివాకర

ఖమ్మం టౌన్/ కూసుమంచి, వెలుగు : మున్నేరు పరిరక్షణ గోడ నిర్మాణ పనులు స్పీడప్​ చేసి, భూసేకరణ, డ్రైనేజీ, లేఅవుట్ అభివృద్ధి, తదితర అంశాలను నిర్దిష్ట గడువుల్లోగా పూర్తి చేసేలా ఆఫీసర్లను సమన్వయంతో పనిచేయాలని ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఆయన మున్నేరు పరిరక్షణ గోడ నిర్మాణ పనుల పురోగతి, ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌పీ భూముల్లో లేఅవుట్ అభివృద్ధి, డ్రైనేజీ డిజైన్, భూసేకరణ తదితర అంశాలపై అడిషనల్​ కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డితో కలిసి సంబంధిత శాఖల ఆఫీసర్లతో సమీక్షించారు. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌పీ భూముల్లో లేఅవుట్ అభివృద్ధికి సంబంధించి అధికారులు అప్రోచ్ రోడ్డు, వంతెన నిర్మాణ ప్రతిపాదనలు సమర్పించారని, జాతీయ రహదారుల శాఖ ఇంజినీర్ సూచించిన విధంగా నాలుగు లేన్ల రహదారి ఏర్పాటుపై సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.

సవరించిన తుది ప్రతిపాదనను రెండు రోజుల్లో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌‌‌‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా అధికారులు కార్యాచరణ చేపట్టాలన్నారు. అనంతరం కూసుమంచి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్​ప్రక్రియను ఆయన పరిశీలించారు. మండల కేంద్రంలోని శివాలయం వీధిలో బీఎల్వోలు నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎన్యుమరేషన్​ ఫారాలను సకాలంలో తిరిగి స్వీకరించి, డిజిటలైజేషన్​ పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్​కాలేజీ, ఏరియా ఆస్పత్రి, కస్తూర్భా బాలికల విద్యాలయాన్ని పరివీలించి సమస్యలపై ఆరా తీశారు. విద్యార్తులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు